శ్రీ విష్ణు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో వంటి సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. ఇక హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు బిగ్ హిట్ అందుకున్నాడు. కంటెంట్ బేస్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని కెరీర్ సాగిస్తున్నాడు ఈ యంగ్…
(ఫిబ్రవరి 19న దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ పుట్టినరోజు) చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్. కాశీనాథుని విశ్వనాథ్…