తెలుగు సినిమా ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఫిబ్రవరి 19న దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ పుట్టినరోజు)
చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతమ్మ. బాల్యం నుంచీ చదువుల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్, అప్పట్లోనే రామాయణ, భారత, భాగవతాలు చదివేశారు. ఏ పుస్తకం కనిపించినా, చదువుతూ పోయేవారు. గుంటూరు హిందూ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివిన విశ్వనాథ్, అదే ఊరిలోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బి.యస్సీ. పట్టా పుచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం విజయా-వాహినీ సంస్థలో పనిచేసేవారు. దాంతో డిగ్రీ పూర్తి కాగానే విజయావాహినీ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా చేరారు. విజయా సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’కి అసిస్టెంట్ రికార్డిస్ట్ గా చేశారు విశ్వనాథ్. విశ్వనాథ్ కు తొలి నుంచీ కళారాధన అధికం. సకల కళలకూ నెలవైన విశ్వనాథుని పేరు పెట్టుకున్న ఆయన మనసు చిత్రసీమవైపు మరలడంలో ఆశ్చర్యమేముంది?… సౌండ్ ఇంజనీర్ గా చేశాక, ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ‘ఆత్మగౌరవం’ చిత్రంతో కె.విశ్వనాథ్ ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. తొలి చిత్రంలోనే తనదైన బాణీ ప్రదర్శించారు విశ్వనాథ్.
నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ తో చిత్రాలు రూపొందించారు విశ్వనాథ్. అప్పటి వర్ధమాన కథానాయకులు కృష్ణ, శోభన్ బాబుతోనూ మురిపించే సినిమాలు అందించారు. తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచీ ఆయన తపించేవారు. అందుకు తగ్గట్టుగానే కథలను ఎంచుకొనేవారు. తెలుగునాట శోభన్ బాబు, చంద్రమోహన్, కమల్ హాసన్ వంటివారు స్టార్ డమ్ చూడటానికి ఆయన చిత్రాలు కారణమయ్యాయని చెప్పవచ్చు.
విశ్వనాథ్ పేరు వినగానే ముందుగా ఆయన చిత్రాలలో పెద్ద పీట వేసుకున్న సంగీతసాహిత్యాలు గుర్తుకు వస్తాయి. తరువాత కథల్లోనే లీనమై ఆకర్షించే కళలూ స్ఫురిస్తాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు కళాఖండాలు నవతరం ప్రేక్షకులను సైతం మురిపిస్తూనే ఉన్నాయి. కె.విశ్వనాథ్ చిత్రాలను చూసి ఆ రోజుల్లో ఎందరో లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తరువాతి రోజుల్లో కళాకారులుగానూ రాణించారు. అంతలా తెలుగువారిని కళలవైపు మళ్ళించిన దర్శకులు మరొకరు కానరారు. ‘శంకరాభరణం’ విడుదలైన రోజుల్లో తెలుగునాటనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ సీమల్లోనూ పలువురు బాలలు గానంపై ధ్యానం పెట్టారు. ఆ చిత్రంతోనే కమర్షియల్ చట్రంలో చిక్కుకున్న తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవం తీసుకు వచ్చారు విశ్వనాథ్. ‘శంకరాభరణం’ తరువాత విశ్వనాథ్ నిర్దేశకత్వంలో వెలుగు చూసిన “శుభోదయం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం” ఇలా ఎన్నెన్నో కళాఖండాలు మన మదిలో తిష్ట వేసుకున్నాయి.
విశ్వనాథ్ సినిమాల్లో నటిస్తే చాలు అనుకొనేవారెందరో! అలా అనుకున్నవారికి విశ్వనాథ్ చిత్రాలే అభినయంలో శిక్షణ ఇచ్చాయని చెప్పాలి. నటులకు శిక్షణ ఇచ్చిన విశ్వనాథుడు తరువాత నటునిగానూ మురిపించిన వైనం మరపురానిది. ‘శుభసంకల్పం’తో నటునిగా మారిన తరువాత కె.విశ్వనాథ్ వైపు పలు పాత్రలు పరుగులు తీస్తూ వచ్చాయి. అప్పటి దాకా ఎంతోమంది నటీనటులను తీర్చిదిద్దిన విశ్వనాథ్ ఒక్కసారిగా నటనలో బిజీ అయిపోయారు. మహామహులతో పనిచేసిన విశ్వనాథ్ ను డైరెక్ట్ చేసే అదృష్టం కలిగినందుకు ఆ యా చిత్రాల దర్శకులు పులకించిపోయేవారు.
నటునిగా రాణించడం మొదలు పెట్టాక, దర్శకత్వానికి దూరంగానే జరిగారు విశ్వనాథ్. అయితే ఆయన దర్శకత్వం అంటే ప్రాణం పెట్టేవారు మళ్ళీ మెగా ఫోన్ పట్టమని బలవంతం చేశారు. కానీ, కళాతపస్వి అంతకు ముందులా దర్శకత్వంతో ఆకట్టుకోలేక పోయారు. అందుకే దర్శకత్వానికి స్వస్తి అన్నారు. ఇక తన దరికి చేరిన పాత్రలకు మాత్రం న్యాయం చేయడానికి విశ్వనాథ్ తపించారు.
ఫిబ్రవరి 19తో 92 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విశ్వనాథ్, మరిన్ని వసంతాలు చూస్తూ మరింత ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!