బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయం అయిన సినిమా 'స్వాతిముత్యం'. ఈ నెల 5న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. దాంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో ప్రదర్శించాలని ఆహా సంస్థ భావించింది.