ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు మరియు నగరాల్లోని వార్డు సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని ‘వార్డు సచివాలయం’ అని కాకుండా ‘స్వర్ణ వార్డు’గా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించి…