ఇప్పటి వరకూ లక్ష మంది శిక్షణ తీసుకున్నారు.. గ్రామీణ సాధికారతే లక్ష్యంగా ఈ ట్రస్ట్ పని చేస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి స్వర్ణ భారత్ ట్రస్ట్ పని చేస్తోంది అని వెంకయ్య నాయుడు వెల్లడించారు.
ముచ్చింతల్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'ఉగాది సంబరం' పేరుతో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు పాల్గొన్నారు.