నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్ లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఐదో రోజైన బుధవారం.. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సేవాకాలం నివేదన, మంగళాశాసనాలు, శాత్తుమోరై, వేద విన్నపాలు, ద్వారా తోరణ ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం మూలమంత్రమూర్తి మంత్రహవనం, పంచసూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్యపూర్ణాహుతి, నివేదన, మంగళాశాసనములు, వేద విన్నపాలు,…