అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబధిత అధికారులపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2 తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు..