సాధారణంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌లో హీరోయిన్లు చాలా తక్కువగా మాట్లాడుతారు. అందరికీ నమస్కారలంటూ మొదలుపెట్టి, ఏవో రెండు ముక్కలు మాట్లాడేసి, చిత్రబృందానికి థాంక్స్ అని చెప్పి సైడ్ అయిపోతారు. కానీ, సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం కీర్తి సురేశ్ అలా చేయలేదు. సినిమాలో తాను పోషించిన అల్లరి పాత్ర తరహాలోనే, చిలిపిగా మాట్లాడుతూ అందరి మనసులు దోచేసింది. ఇదే సమయంలో దర్శకుడు పరశురామ్‌ని ఆటపట్టిస్తూ, ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని షేర్ చేసింది. షూటింగ్‌లో అప్పుడప్పుడు తనని…
‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానా.. మహేశ్ బాబుపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఆయన్ను చూశాకే అబ్బాయిలు కూడా అందంగా ఉంటారన్న విషయం తనకు అవగతమైందన్నాడు. 1: నేనొక్కడినే సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశానని, ఓ రోజు సెట్స్‌లో ఉన్నప్పుడు మహేశ్ కారు దిగి, జుట్టు సవరించుకుంటూ వస్తోంటే తాను చూసి ఫిదా అయ్యానని అన్నాడు. అప్పుడే అబ్బాయిలు అందంగా ఉంటారని తాను తెలుసుకున్నానని,…
మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే చిత్రబృందం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహేశ్‌కి అత్యంత సన్నిహితుడైన మెహర్ రమేశ్ కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేశ్‌ని ద బెస్ట్ వేలో పూరీ…