మహీంద్ర గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒక్క వ్యాపారంలోనే కాదు నెట్టింట కూడా చురుకుగా ఉంటారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా తమ కస్టమర్ ట్వీట్‌కు స్పందించి మరోసారి నెటిజన్ల మనసు దోచుకున్నారు.