కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు అంటే ఎవరికీ అంతగా తెలియదు, అదే ‘సుత్తివేలు’ అన్నామనుకోండి, ఇట్టే నవ్వులు మన పెదాలపై నాట్యం చేస్తాయి. జంధ్యాల సృష్టించిన సుత్తి జంటలో వీరభద్రరావుతో కలసి వేలు పలికించిన హాస్యాని తెలుగు జనం ఎన్నటికీ మరచిపోలేరు. తన దరికి చేరిన ప్రతీపాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించి సంతృప్తి చెందారు వేలు. దాదాపు రెండు వందల చిత్రాలలో సుత్తివేలు హాస్యం భలేగా జనాన్ని ఆకట్టుకుంది. సుత్తివేలు తండ్రి బడిపంతులు. చిన్నతనం నుంచీ…