Hyderabad family suicide: హైదరాబాద్ మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఫుడ్ పాయిజన్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్.. ఉపాధి కోసం ఫ్యామిలీతో హైదరాబాద్‌కు వచ్చాడు. అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటూ మేస్త్రీ పని చేస్తూ ఉండే వాడు. కవితను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి రెండేళ్ల చిన్నారి కూతురు…