పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. దీంతో స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు విద్యార్ధులు. సూర్యాపేట జిల్లాలో ఓ హెడ్మాస్టర్ విద్యార్దుల్ని లైంగికంగా వేధించాడు. చదువు చెప్పాల్సిన హెడ్మాస్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆ కీచకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధినులను ప్రిన్సిపాల్ అనిల్ లైంగికంగా వేధించాడు. చుట్టుపక్కల గ్రామాలు, తండాలు విద్యార్ధినులు ఇక్కడికి…