Suryakumar Yadav Set to Join Mumbai Indians Squad: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే జట్టులో కలుస్తాడని తెలుస్తోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్యులు సూర్యకు ఫిట్‌నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ 7న ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో సూర్య ఆడే అవకాశాలు ఉన్నాయని ఎన్‌సీఏకి చెందిన…