Surya Kumar Yadav: దుబాయ్‌లో ఆసియా కప్ 2025 ను భారత్ కైవసం చేసుకుంది. ఇక టోర్నీని గెలిచిన తర్వాత ట్రోఫీని తిరస్కరించిన సంఘటనపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జట్టు మొత్తం టోర్నమెంట్‌లో కష్టపడి విజయం సాధించిందని, అయితే ట్రోఫీని అందుకోలేకపోవడం బాధ కలిగించిందని అన్నాడు. “నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి, ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. అలాగే నాకు తెలిసి ఇలా చేయడం ఇదే మొదటిసారి…