తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెరైటీ కథలు, అద్భుతమైన పాత్రలు ఎంచుకుని నటించే సూర్య, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా లాంచ్ చేసిన చిత్ర బృందం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ చేరబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.…