తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెరైటీ కథలు, అద్భుతమైన పాత్రలు ఎంచుకుని నటించే సూర్య, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా లాంచ్ చేసిన చిత్ర బృందం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ చేరబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
Also Read : Anil Ravipudi : నాకు నేను ఒక ఛలేంజ్ పెట్టుకోని చేసిన మూవీ అదే..
బాలీవుడ్‌లో ‘యానిమల్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి, ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. అయితే ఆమె లీడ్ రోల్‌లో కాకుండా, సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుందట. ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచేశాయి. అంతేకాదు, ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కూడా టాక్ వినిపిస్తోంది. టైటిల్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి.
మైన్ హీరోయిన్‌గా అందాల భామ మమితా బైజు నటిస్తుండగా సంగీతంలో జి.వి. ప్రకాష్ కుమార్ ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించిన మొదటి లుక్, టీజర్ త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సూర్య – వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏ రేంజ్‌లో విజయం సాధిస్తుందో చూడాలి. తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.