నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సురేష్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కరిపే గణేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ప్రతిష్ఠకు భంగం కల్గిస్తూ.. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. Read Also: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శించిన సీపీ కరిపె గణేష్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్టు…
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం ఇటీవల విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సురేష్ సెల్ఫీవీడియో లభ్యమైంది. అయితే ఈ సెల్ఫీ వీడియోని కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలు వడ్డీరూపంలో చెల్లించానని, వడ్డీ వ్యాపారి గణేష్‌కి రూ.80 లక్షలు చెల్లించానని వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీవీడియోలో సురేష్…