Raju Weds Ramabhai Free Shows: ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కడ చూసిన రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా చర్చే జరుగుతుంది. చిన్న సినిమాగా విడుదలై ‘రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్’గా దూసుకుపోతున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంభాయ్’. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు సాయిలు కంపటి దర్శకత్వం వహించగా, వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. దీనికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.…
ప్రముఖ రాజకీయ నాయకుడు, పేద ప్రజల పక్షపాతిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెరకెక్కనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో కన్నడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ…
తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే…