ఆన్ లైన్ గేమ్స్ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. భారీగా డబ్బులు వస్తాయన్న ఆశతో పెట్టుబడులు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక మానసిక వేదనతో తనువు చాలిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ కారణంగా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. తాజాగా మరో యువకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బలయ్యాడు. కుత్బుల్లాపూర్, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read:ఆయుర్వేదంలో ఆపరేషన్లకు…
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.