ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అంసెబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించారని ఆరోపణలు చేస్తూ ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నాయకుల మాటలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సదరు హెడ్ కానిస్టేబుల్ ఓ వీడియో విడుదల చేశారు. తను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998…