తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. సాంకేతికంగా ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా.. వాళ్లను మాత్రం మూఢ నమ్మకాల జాఢ్యం వదలడం లేదు. ఇంకా చేతబడులు, చిల్లంగి, బాణామతి చేస్తున్నారంటూ గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. మానసికంగా భయాందోళన చెందుతూ ఎదుటి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తమపై బాణామతి చేస్తున్నారనో.. లేదా తాము బాణామతి బారిన పడ్డామనో.. ఇంకా కొంత మంది జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు. చేతబడి గురించి భయపడుతూ మానసిక…