సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. రజనీకాంత్ నేడు తమిళనాడు గవర్నర్‌తో సమావేశం కావడమే. ఈ నేపథ్యంలో రజనీ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో టాప్ 10 మూవీస్ లో ‘శివాజీ’ ఒకటి ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అమెరికా నుంచి వచ్చిన ఒక యువకుడు తన దేశం యొక్క పరిస్థితిని చూసి ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలకు అందివ్వాలనుకుంటాడు. కానీ దేశంలో ఉన్న రాజకీయ నాయకులూ లంచం కోసం అతడిని అడ్డుకొని జైలుకు పంపిస్తారు.సేవ చేయాలంటే మంచి…
నటుడిగా రజనీకాంత్ ది నలభై ఆరేళ్ల సుదీర్ఘ ప్రయాణం. చిత్రం ఏమంటే నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఏదీ ఇంతవరకూ దక్కలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ పురస్కారంతోనూ, 2016లో పద్మ విభూషణ్ పురస్కారంతోనూ గౌరవించింది. ఇక తాజాగా 2021కి సంబంధించి సినిమా ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా…
ఈరోజు అక్టోబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. తన కుటుంబంతో కలిసి అవార్డుల వేడుకకు హాజరయ్యారు రజినీకాంత్. గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రజనీకాంత్‌కి అవార్డును అందజేసి అభినందించారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించిన రజనీకాంత్ చిరునవ్వుతో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. తాను అందుకున్న ఈ అవార్డును తన గురువు కె బాలచందర్ కు, రజినీకాంత్ అన్నయ్య సత్యనారాయణ…
తలైవా రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం ఈరోజు ఉదయం అమెరికా బయలుదేరారు. మే 2016లో రజినికి మూత్రపిండాల వ్యాధి కారణంగా… అమెరికాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌లో నిపుణుల బృందం కిడ్నీ మార్పిడి చేశారు. తరువాత నుంచి ఆయన యునైటెడ్ స్టేట్స్ లోని అదే ఆసుపత్రిలో వార్షిక వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా రజినీ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళలేకపోయారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో రజినీకాంత్ అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు.…
సూపర్ స్టార్ రజినీకాంత్ తో మంచు లక్ష్మి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పంచుకుంది. ఈ పిక్ చూస్తుంటే ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత రజనీకాంత్ హైదరాబాద్ లోని తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు కన్పిస్తోంది. గత కొద్దిరోజులుగా ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. సూపర్…