Aishwarya Rajinikanth Getting Ready To Direct A Film After 5 Years: దక్షిణాదిలోని ఆదర్శ దంపతులుగా నిలిచిన జంటల్లో ధనుష్, ఐశ్వర్య జంట ఒకటి. అలాంటి దంపతులు విడాకులు తీసుకోవడంతో యావత్ సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. సడెన్‌గా తమ డివోర్స్ సంగతి చెప్పడంతో.. చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇందుకు కారణాలేంటన్న విషయంపై రకరకాల రూమర్లైతే చక్కర్లు కొడుతున్నాయి కానీ, ఇంతవరకూ సరైన స్పష్టత మాత్రం రాలేదు. అయితే.. ధనుష్ మాత్రం విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. మరి.. ఐశ్వర్య సంగతేంటి? ఆమె ఏం చేస్తోంది? అనేది చర్చనీయాంశమైంది. ఐశ్వర్య కూడా తన తదుపరి ప్లాన్స్ ఏంటన్నది ఎప్పుడూ రివీల్ చేయలేదు.
ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఐశ్వర్య రజినీకాంత్ త్వరలోనే మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోందని, ఇందులో రజినీకాంత్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఇంతకుమించి ఈ ప్రాజెక్ట్ గురించి మరే ఇతర వివరాలు వెలుగులోకి రాలేదు. కాగా.. ఐశ్వర్య 2012లోనే డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే! తన మాజీ భర్త ధనుష్‌తో కలిసి ‘3’ మూవీ చేసింది. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా, అనిరుధ్ సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించలేదు కానీ, ‘వై దిస్ కొలవెరీ’ పాట పుణ్యమా అని అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆ చిత్రం తర్వాత 2014లో ‘వై రాజా వై’ అనే సినిమాకి ఐశ్వర్య దర్శకత్వం వహించింది. అనంతరం 2017లో సినీ స్టంట్ మాస్టర్స్ ఇతివృత్తంతో ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీ తీసింది. అంతే.. ఆ తర్వాత మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ధనుష్‌తో విడాకులు తీసుకున్నాక, ఐదేళ్ల తర్వాత మరోసారి దర్శకులుగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుందని, ఐశ్వర్య అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని మలచనుందని తెలిసింది.