మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ నుండి చిత్ర బృందం మరో అదిరిపోయే మాస్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సూపర్ డూపర్’ అంటూ సాగే ఈ ఉత్సాహభరితమైన గీతం, శ్రోతలకు మాస్ విందును అందిస్తోంది. ‘మాస్ జాతర’ ఆల్బమ్ నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొని, సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. తాజాగా విడుదలైన ఈ నాలుగో…