కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కొత్త పుస్తకంపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మనోభావాలను దెబ్బతీస్తే, ప్రజలు ఇంకేదైనా చదవాలని పేర్కొంది. కోర్టు పిటిషనర్‌తో, “ప్రజలను కొనుగోలు చేయవద్దని లేదా చదవవద్దని మీరు ఎందుకు అడగరు? పుస్తకం తప్పుగా రచించబడిందని దానిని చదవవద్దని అందరికీ చెప్పండి. మనోభావాలు దెబ్బతింటుంటే, వారు ఇంకేదైనా చదువుతారని కోర్టు పేర్కొంది. కాగా, ఈ పుస్తకం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై నిషేధం విధించాలని, వాక్, భావప్రకటనా స్వేచ్ఛను…