ట్విట్టర్ ద్వారా కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్ పర్సన్ బీఆర్ నాయుడు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖపై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ హాల్ టికెట్ లో అభ్యర్థి ఫోటోకు బదులు రాష్ట్ర విద్యాశాఖ బ్లూ ఫిల్మ్ నటి సన్నీలియోన్ ఫోటోను ముద్రించింది.. అసెంబ్లీలో నీలి చిత్రాలను చూసే పార్టీ నుంచి ఇంకేం ఆశించగలం అని ఆయన కన్నడలో ట్వీట్ చేశారు.