సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు.
నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను మంత్రులు పరిశీలించారు.
KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Sunkishala Project: నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు.