తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కెరీర్ ప్రారంభం నుండి ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. విశేషమేమిటంటే, వీరిద్దరూ 2002 అక్టోబర్ 11వ తేదీనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాస్య నటుడు సునీల్ వివాహం ‘శృతి’తో 2002 అక్టోబర్ 11న అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటల 28 నిమిషాలకు సుముహూర్తాన వీరి వివాహ…