ఇరాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉష్ణ సూచికపై ఏకంగా 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు వాతావరణంలోని తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైనట్లు అమెరికాకు చెందిన వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు.