సాధారణంగా సౌర తుఫానుల నుంచి వెలువడే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వీటిని ముందుగానే ఆదిత్య-ఎల్1 గుర్తిస్తుంది. దీని వల్ల శాటిలైట్లను రక్షించుకోవచ్చు.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఐఐటీ బొంబాయి వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ ఫెస్టివల్‌లో ఆయన మిషన్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్ ప్లానెటరీ మిషన్, ఆదిత్య ఎల్1 సోలాల్ మిషన్ విజయవంతంగా నిర్దేశించిన మార్గంలో వెళ్తోంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఆదిత్యఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక చివరి దశకు చేరుకుందని, L1 కక్ష్యలో ప్రవేశపెట్టే విన్యాసాలు జనవరి 7, 2024 నాటికి పూర్తవుతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
Adtiya L1 Mission: భారతదేశం మొదటి సన్ మిషన్ కింద అంతరిక్షంలోకి పంపబడిన ఆదిత్య L-1 అంతరిక్ష నౌక నాల్గవ 'ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని' విజయవంతంగా పూర్తి చేసింది.
Aditya-L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ దిగ్విజయంగా తన లక్ష్యం వైపు కదులుతోంది. సూర్యుడిపై పరిశోధనలకు చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. తాజాగా ఆదిత్య ఎల్1 ఆన్ బోర్డ్ కెమెరాల సాయంతో సెల్ఫీ తీసింది. దీంతో భూమి, చంద్రుడు కనిపించడం చూడొచ్చు. చంద్రుడు భూమికి కుడి వైపున చిన్న చుక్కలా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది.
భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 కోసం శుక్రవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైనందున, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఇది ఒక ముఖ్యమైన ప్రయోగమని, ఉపగ్రహం ఎల్ 1 (లాగ్రాంజియన్ పాయింట్ 1) పాయింట్‌ను చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని చెప్పారు.
భారత్ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రారంభానికి కౌంట్‌డౌన్‌లు ప్రారంభమవుతున్న వేళ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం మాట్లాడుతూ.. మనం చంద్రుడిని చేరుకున్నామని, త్వరలో సూర్యుని దగ్గరికి చేరుకుంటామని చెప్పారు.