పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతమైన వేడుక. అందుకే కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే కరోనాతో గత రెండేళ్లుగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా ఉధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావిడి నెలకొంది. అయితే ఈ ఏడాది జూన్ నెల దాటితే ముహూర్తాలు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడంతో…