రెండు దేశాల మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతపై భారత ప్రభుత్వం సోమవారం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌ను పిలిపించింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిచిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులోని ఐదు చోట్ల ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపించడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్‌లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై 2025 జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది.
బుక్‌మైషో సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రజనీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. "బుక్ మై షో" అనేది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించే ప్లాట్‌ఫాం.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఈ ఫేక్ వీడియోపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ వీడియోపై హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. చౌకబారు రాజకీయాలు చేస్తూనే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని బీజేపీ…
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల నుంచి నుపుర్‌కు నోటీసులు వెళ్తున్నాయి.. తాజాగా, కోల్‌కతా పోలీసులు షాక్ ఇచ్చారు. నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 153ఏ, 295ఏ, 298 మరియు 34 సెక్షన్‌ల కింద నుపుర్ శర్మపై కేసు నమోదు చేశారు కోల్‌కతా పోలీసులు.. ఇక, 41ఏ CrPC కింద జూన్ 20వ తేదీన తమ ముందు…