నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో ప్రధాన నిందితులు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాంగ్వాన్‌లను 10 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. గోవాలోని అంజునా బీచ్‌లో కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌తో పాటు మాదకద్రవ్యాల వ్యాపారి దత్‌ప్రసాద్ గాంకర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
రెండు రోజుల కిందట గోవా పర్యటనలో టిక్ టిక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.