బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
Tragedy : హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ మండలం, పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెన్నెలగడ్డలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం (మార్చి 10) జరిగిన ఈ ఘటనలో, 26 ఏళ్ల ప్రియాంక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ సిబ్బంది,…
టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ తన ఇంటికి వెళ్తుండగా.. డెహ్రాడూన్ హైవేపై అతని కారు ప్రమాదానికి గురైంది. అయితే.. హైవేపై ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు పంత్ ప్రాణాలను కాపాడారు. అయితే.. పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తులలో రజత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.
చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్నపాటి విషయాలకు మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఇనుప తాళాలు మింగిన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగింది.