Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి. డాక్టర్ అజయ్ కుమార్…
'ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం... దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం...' అని ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది.
ఘజియాబాద్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. జూలై 12న ఘుక్నా నివాసి శివాని త్యాగి ఆత్మహత్య చేసుకున్న కేసులో సోదరుడి ఫిర్యాదు మేరకు నందగ్రామ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. సూసైడ్ నోట్ ఆధారంగా శివాని సోదరుడు రిపోర్టు ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో శివాని సహోద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాసింది. దీంతో అతడు ముంబైలోని భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సంగారెడ్డిలో పీజీ మెడికల్ విద్యార్థి ఆదృశ్యం కలకలం రేపుతుంది. తమిళనాడుకి చెందిన పీజీ మెడికల్ స్టూడెంట్ గోకుల్ నాథ్ తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి అదృశ్యమైయ్యాడు. నిన్నటి నుంచి గోకుల్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు.
Suicide Note: తన చావుకు ఉపాధ్యాయుడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ విధ్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఆకాష్ ఓ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్నాడు. రోజూ లాగేనే తను కాలేజ్ కి వెళ్లాడు. క్లాస్ రూం లో సెల్ ఫోన్ చూస్తుండగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మాథ్స్ లెక్చర్ ఆ సెల్‌ని చూసాడు. అందులో ఓ విద్యార్థిని ఫోటో డీపీగా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవా నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదాల కారణంగా భార్యా పిల్లలతో సహా రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీ సేవా నిర్వాహకుడు రామకృష్ణతో పాటు అతడి భార్య లక్ష్మీ, కూతూరు సాహిత్య సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. Read Also: శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్…