భారత సైన్యం దగ్గర ఇప్పుడు బలమైన ఆయుధం ఉంది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ మొదటి స్వదేశీ లాటరింగ్ మందుగుండు 'నాగాస్త్ర-1'ని భారత సైన్యానికి అందజేసింది. ఇది ఇంట్లోకి ప్రవేశించి శత్రువులపై దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారు. ఈ డ్రోన్ శత్రు భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం కలిగిస్తుంది.