మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమేశ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తన కొడుకు సోమేశ్ తెల్లవారు 4గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటి సమీపంలోని గౌడవెల్లిలో రైల్ ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నడన్నారు. లక్షల్లో సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని తెలిపారు. గతంలో తమ కూతురు…
Wife harassment: భార్య, భార్య తరుపు బంధువులు వేధింపులతో ఇటీవల కాలంలో పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం సంచలనంగా మారింది. తన కంపెనీ వెబ్‌సైట్‌లో తన భార్య, అత్తలను నిందిస్తూ ఆయన సూసైడ్ నోట్ పోస్ట్ చేశారు. ముంబైలోని ఓ హోటల్ గదిలో 41 ఏళ్ల నిశాంత్ త్రిపాఠి ఆత్మహత్య చేసుకున్నాడు. గత శుక్రవారం సహారా హోటల్‌లోని తన గదిలో ఉరివేసుకుని మరణించాడు.
Kavya Kalyani: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమైన ఢీ షో డాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు పేరు తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు. అయితే, తాజాగా ఢీ షో కు చెందిన ఓ డాన్సర్ పేరు మళ్ళీ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి విషాదకరమైన ఘటనకు సంబంధించింది వార్తల్లో నిలిచింది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో కావ్యకళ్యాణి (24) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి కారణం…
Wife Harassment: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో…
Police Constable:భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను భార్యతో తరచూ గొడవపడేవాడు. నాలుగైదు రోజులుగా…
Suicide : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ భవాని నగర్ లో దారుణం చోటు చేసుకుంది.ఒమేగా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణిమ అనే విద్యార్థిని నిన్న రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల నుండి వచ్చిన తర్వాత పూర్ణిమ ను నిఖిల్ అనే వ్యక్తి నుండి ప్రేమ పేరుతో వేధింపులు శృతి మించడంతో మనస్తాపానికి గురై యాసిడ్ తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రేమ పేరుతో నిఖిల్ అనే వ్యక్తి పూర్ణిమను…
Online Betting Suicide: ఈ మధ్యకాలంలో ప్రజలు కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో విజయం సాధిస్తే సరి.. లేకపోతే, చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం మీడియా ద్వారా అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక మరణాలను చూసే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు…
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా... శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్నర్లను మార్చడం "నైతికం"గా సరికాదు, కానీ రిలేషన్షిప్లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.