విజయనగరం జిల్లాలో చెరుకు రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. అయితే, పోలీసుల అడ్డంకులు కొనసాగుతున్నాయి. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, అసలు రైతులు తగినంత చెరకు పండించడం లేదంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి మాటలను ఖండిస్తూ నేడు మహాపాదయాత్రకు పిలుపునిచ్చారు రైతులు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం నుండి కలెక్టరేట్ వరకూ మహాపాదయాత్ర చేపడుతున్నారు రైతులు. రైతులకు నాయకత్వం వహిస్తున్న తమ్మినేని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.…