దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో నిఫ్టీలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన నష్టాలను చవిచూశాయి.
ట్రంప్ వాణిజ్య యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం అల్లకల్లోలం అయిపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ నష్టాలతో ప్రారంభమైంది. సూచీలన్నీ భారీగా పతనం అయిపోయాయి.