‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’.. నిన్న (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్‌గా అనిపిస్తుందని పలువురు ప్రశంసలు కురిపిస్తోన్నారు. హీరోయిన్ ఆనంది కూడా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ సినిమా విశేషాల గూర్చి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ‘పలాస 1978 చూశాక నాకు…
ఈ సినిమా పై మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు తన ప్రైవేట్ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి బావమర్ది సుధీర్ బాబు కొత్త చిత్రమైన “శ్రీదేవి సోడా సెంటర్”ను వీక్షించారు. అనంతరం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. “శ్రీదేవి సోడా సెంటర్” క్లైమాక్స్ రా, ఇంటెన్స్, హార్డ్ హిట్టింగ్. పలాస 1978 తర్వాత దర్శకుడు కరణ్ కుమార్ మరో బోల్డ్ చిత్రంతో వచ్చాడు. సుధీర్ బాబు బ్రిలియంట్. ఇప్పటి వరకు…
గత యేడాది సెప్టెంబర్ 5న కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో సుధీర్ బాబు ‘వి’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. జనవరిలో అది థియేట్రికల్ రిలీజ్ అయినా ప్రతికూల ఫలితమే దక్కింది. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. గత యేడాది మార్చిలో వచ్చిన ‘పలాస’ మూవీతో దర్శకుడిగా పరిచయమై, మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ తెరకెక్కించిన రెండవ…
సుధీర్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్ ను పూర్తి స్థాయిలో మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్. 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు విజయ్ చిల్లా. శశిదేవరెడ్డి. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ చిత్రానికి యు.ఎ సర్టిఫికెట్ లభించిందని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని నిర్మాతలు అంటున్నారు. ఆగస్ట్ 27న విడుదల అవుతున్న సందర్బంగా…
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 27న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటికే అగ్ర కథానాయకులు పాలు పంచుకోగా… ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తనవంతు సాయం అందించాడు. ఈ సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి మూవీ విశేషాలను వారి…
70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ అతిరథుల సమక్షంలో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తమ్మారెడ్డి భరద్వాజ, ఇంద్రగంటి మోహనకృష్ణ, అనిల్ రావిపూడి,…
యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా సక్సెస్ కావాలని కోరారు. ట్రైలర్ చూస్తుంటే ఇది రివేంజ్ డ్రామాలా కన్పిస్తోంది. ఇంతవరకూ టీజర్, పోస్టర్లతో సినిమాను సాఫ్ట్ కార్నర్ లో చూపించిన మేకర్స్ ట్రైలర్ లో మాత్రం డిఫరెంట్ గా మాస్ తో యాక్షన్ ను కూడా చూపించారు.…
యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఇప్పుడు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు (ఆగస్టు 19) ఉదయం 10 గంటలకు “శ్రీదేవి సోడా సెంటర్” థియేట్రికల్ ట్రైలర్‌ను మహేష్ ఆవిష్కరిస్తున్నారు. ఆగస్ట్ 27న ఈ సినిమా…