70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ అతిరథుల సమక్షంలో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తమ్మారెడ్డి భరద్వాజ, ఇంద్రగంటి మోహనకృష్ణ, అనిల్ రావిపూడి, అజయ్ భూపతి, బుచ్చిబాబు, శ్రీరామ్ ఆదిత్య, హర్షవర్ధన్, సుధీర్, రమణ తేజ, నిర్మాతలు అదిశేషగిరి రావు, రాజ్ కందుకూరి, విష్ణు, హీరో కార్తికేయ తదితరులు హాజరయ్యారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ మొదటి బిగ్ టికెట్ ను హీరో సుధీర్ బాబు తల్లిదండ్రులు విడుదల చేయగా, అనిల్ రావిపూడి, కార్తికేయ ఫస్ట్ టికెట్స్ ను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”వైవిధ్యమైన కథలతో ముందుకెళ్లే హీరో సుధీర్ బాబు. కొత్త కథలకు ప్రాధాన్యత నిచ్చే వారు 70 ఎం. ఎం. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు . ‘పలాస 1978’ లాంటి డిఫరెంట్ కథలు రాసుకొని సినిమా చేసే దర్శకుడు కరుణ కుమార్… తెలుగు సంగీతానికే నిర్వచనం చెప్పిన సంగీత దర్శకుడు మణిశర్మ… జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్… వీరందరూ కలసి చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంనే నమ్మకం ఉంది” అని అన్నారు.
నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ ”ప్రస్తుతం పెద్ద పెద్ద నిర్మాతలు భయపడి వారి సినిమాలను ఓటిటి లలో విడుదల చేస్తుంటే ఈ చిత్ర నిర్మాతలు ఎంతో ధైర్యం చేసి థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పడం ఒక మంచి శుభ సూచకం” అని అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ.. ”చాలా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తాడు సుధీర్. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. తనతో నేను రెండు సినిమాలు చేశాను. ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. తను భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన సినిమాలు తీయాలి. అలాగే చరిత్రలో మనకు తెలియని విషయాలను ‘పలాస 1978’ చిత్రం ద్వారా తెలిపాడు దర్శకుడు కరుణ కుమార్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఎంతో ప్యాసినెట్ గా నిర్మించారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని చెప్పారు.
Read Also : “భోళా శంకర్” నుంచి “రాఖీ” స్పెషల్ సర్ప్రైజ్
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ”’భలే మంచి రోజు, యాత్ర, ఆనందో బ్రహ్మ’, ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’… ఇలా భిన్నమైన చిత్రాలను ఈ నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు కరుణ కుమార్ తీసిన పలాస 1978 చూశాను, చాలా బాగుంది. సుధీర్ బాబు గారు ఆల్ రౌండర్. తను బ్యాడ్మింటన్, క్రికెటర్, ఫైటర్, డాన్సర్ ఇలా ప్రతిదాంట్లో హార్డ్ వర్క్ తో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాగ్రౌండ్ ఉండి కూడా ఇండివిడ్యువల్ గా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావిస్తూ ఎంతో కష్టపడుతున్నారు. సుధీర్ గారికి ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ ఫుల్ సినిమా కావాలి” అని అన్నారు.
చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ ”ఈ రోజు నేను ఈ వేదిక మీద నిలబడ్డానికి ‘పలాస’ సినిమానే కారణం. ఆ సినిమా అవకాశం ఇచ్చిన అట్లూరి వరప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. ఆ ప్రాజెక్టుని బ్యాక్ లో ఉండి నడిపించిన అప్పారావు, తమ్మారెడ్డి గార్లకు నా కృతజ్ఞతలు. సుధీర్ బాబు 12 సినిమాలు చేసిన హీరో అయ్యి ఉండి కూడా నేను చెప్పిన కథ నచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నిమ్మకాయల ప్రసాద్ నాకెంతో సపోర్టు ఇచ్చారు. నా స్నేహితుడు నాగేంద్ర కాశి ఇంత మంచి కథను నాకు అందించాడు. అందరి సపోర్ట్ తో అనుకున్న టైంకి సినిమాను పూర్తి చేశాము. ఆగస్టు 27న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది” అని చెప్పారు.
చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు మాట్లాడుతూ, ”మా సినిమాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి మాకు సపోర్ట్ గా నిలిచిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ గార్లకు కృతజ్ఞతలు. మేము మొదటి సారి ‘పలాస 1978’ సినిమా చూశాం. అది మాకెంతో కిక్ నిచ్చింది ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని అప్పుడే నిర్ణయించు కున్నాం. అనుకున్నట్టుగానే సుధీర్ గారి ద్వారా ఈ కథ మా దగ్గరకు వచ్చింది. దాంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాం. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి మాకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ధైర్యంతో ముందుకు సాగాం. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగానే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా బిజినెస్ అయిపోయింది. దీనికంతా కారణం బెస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేయడం. ఈ సినిమా తర్వాత దర్శకుడికి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. విదేశాల్లోనూ భారీ స్థాయిలో మూవీని రిలీజ్ చేస్తున్నాం” అని చెప్పారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ, ”దర్శకుడు కరుణ కుమార్ ‘పలాస’ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. దానికంటే ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో సూరిబాబు రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి జ్ఞాపకాల్లోనూ సూరిబాబు, శ్రీదేవి నిలిచిపోతారు. వాళ్ల కోసం మళ్ళీ ఈ సినిమా చూడ్డానికి థియేటర్ కు వస్తారు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ ఇది. గోదావరి భాషలో చెప్పాలంటే ఇది మంచి పులస లాంటి సినిమా. ఇప్పుడు సీజన్ కూడా పులస సీజనే. అదే సీజన్లో ఈ సినిమా వస్తోంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.