యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఇప్పుడు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు (ఆగస్టు 19) ఉదయం 10 గంటలకు “శ్రీదేవి సోడా సెంటర్” థియేట్రికల్ ట్రైలర్‌ను మహేష్ ఆవిష్కరిస్తున్నారు. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ చాలా పాజిటివ్‌గా ఉంది. మహేష్ ప్రమోషన్లలో చేరడంతో సినిమాపై హైప్ మరింతగా పెరుగుతుంది.
Read Also : సూర్యకు షాకిచ్చిన హైకోర్టు… పన్నులు చెల్లించాల్సిందే !
ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా , ఆనంది శ్రీదేవిగా కనిపించబోతోంది.