సుధీర్ బాబుకు ప్రభాస్ దన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 27న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటికే అగ్ర కథానాయకులు పాలు పంచుకోగా… ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తనవంతు సాయం అందించాడు. ఈ సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి మూవీ విశేషాలను వారి నుండి రాబట్టాడు. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వూ బుధవారం రానుంది. సహజంగా మీడియా ముందుకు రావడానికి మొహమాటపడే ప్రభాస్… ఇటీవలే ఇతర చిత్రాలను ప్రమోట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రభాస్ ఏ చిత్రాన్ని అయినా ప్రమోట్ చేస్తే.. ఆ బజ్ వేరే లెవెల్ లో ఉంటుందని ఆ మధ్య ‘జాతిరత్నాలు’ సినిమా నిరూపించింది. అదే మ్యాజిక్ రేపు ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ విషయంలోనూ జరగొచ్చు.
మూవీ రన్ టైమ్ లాక్డ్!
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
తాజాగా ‘శ్రీదేవి సోడాసెంటర్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. కట్స్ ఏమీ లేకుండానే మూవీకి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారని, రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేశామని చిత్ర యూనిట్ తెలిపింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు ఇప్పటికే సోషల్ మీడియా రచ్చ చేస్తున్నాయి. ఆగస్ట్ 26న ఈ సినిమా ప్రీమియర్ షోస్ యు.కె. లో పడబోతున్నాయి. ‘వి’ మూవీ గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఈ యేడాది జనవరిలో దానిని థియేటర్లలో రిలీజ్ చేశారు. దాని తర్వాత వస్తున్న సుధీర్ బాబు మూవీ ఇదే కావడం విశేషం.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!