బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్‌పై ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ పై చర్చలు జరిగాయి.. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి…