కాలం మారుతున్నా కట్నకానుకల ఊసు కరగిపోవడం లేదు. ఒకప్పుడు ‘కన్యాశుల్కం’, ఆ పైన ‘వరకట్నం’ అన్న దురాచారాలు జనాన్ని కుదిపేశాయి. వీటిని నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక చిత్రాలు వెలుగు చూశాయి. గురజాడ సుప్రసిద్ధ నాటకం ఆధారంగా తెరకెక్కిన పి.పులయ్య ‘కన్యాశుల్కం’, యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘వరకట్నం’ ఆ కోవకు చెందిన చిత్రాలే! కె.విశ్వనాథ్ కూడా 40 ఏళ్ళ క్రితం ఆ దిశగా పయనిస్తూ రూపొందించిన చిత్రం ‘శుభలేఖ’. అప్పట్లో వర్ధమాన…