"ఉదయం ఆరింటికి లేచి చకచకా రెడీ అయ్యి.. స్కూల్ కి పరిగెత్తి.. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి రాగానే.. స్నాక్స్ తిని ట్యూషన్ కి వెళ్లి అక్కడి నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ఇంటికి తిరిగి వచ్చి.. డిన్నర్ చేసి స్కూల్, ట్యూషన్ హోంవర్క్ పూర్తి చేసి.. రాత్రి 10 నుంచి 11 గంటలకు పడుకుని మళ్లీ ఉదయం లేచి.. పరిగెత్తడం." రోజూ మీ పిల్లలు ఇంట్లో ఇదే చేస్తున్నారా?
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం చర్చనీయాంశంగా మారింది. కొన్నింటిలో 90కి పైగా మార్కులు రాగా మరికొన్నింట్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థికి ఇంగ్లీష్‌లో 92 మార్కులు, సంస్కృతంలో 93 మార్కులు, ఫిజిక్స్‌లో 55 మార్కులు, కెమిస్ట్రీలో 50 మార్కులు రాగా మ్యాథ్స్ Aలో 27, మ్యాథ్స్ Bలో…