Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని "చట్టవిరుద్ధ సంఘం"గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు (జనవరి 29) ఈ సంస్థను కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం దానిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది.