Ragging Shocks JNTU Nachupally Campus in Jagtial: చక్కగా చదువుకోమని కాలేజీలకు పంపిస్తే.. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు విద్యార్థులు.. తాజాగా జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. “ఇంట్రాక్షన్” పేరుతో సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కాలేజీలో భయానక వాతావరణం నెలకొంది.
Nalgonda: నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులపై రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఇంగ్లీష్ టీచర్ తన 16 ఏళ్ల విద్యార్థిపై ఏడాది పాటు లైంగిక వేధింపులకు పాల్పడింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మైనర్ బాలుడిని ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి, మద్యం తాగించేదని తేలింది. నిరోధక మాత్రలు సైతం ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పేర్కొన్నాడు.
కోల్‌కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డు. "ఈ అత్యాచారం ఘటనను ఈ ముగ్గురు ముందుగానే ప్లాన్ వేశారు.
Caste Discrimination : వసతి గృహాల్లో విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు కుల వివక్షత చూపిస్తున్నారంటూ ఒక బాలిక సెల్ఫీ వీడియో పంపించడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. తమకు ఈ పురుష ఉపాధ్యాయులు వద్దంటూ మహిళల్ని నియమించాలని కన్నీళ్ళతో వేడుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కులం పేరుతో తమను దూషిస్తున్నాడు అంటూ లంబాడి…
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఇద్దరు విద్యార్థినిలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తరగతి గదిలో తోటి విద్యార్థినిల వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Suicide : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ భవాని నగర్ లో దారుణం చోటు చేసుకుంది.ఒమేగా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణిమ అనే విద్యార్థిని నిన్న రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల నుండి వచ్చిన తర్వాత పూర్ణిమ ను నిఖిల్ అనే వ్యక్తి నుండి ప్రేమ పేరుతో వేధింపులు శృతి మించడంతో మనస్తాపానికి గురై యాసిడ్ తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రేమ పేరుతో నిఖిల్ అనే వ్యక్తి పూర్ణిమను…