STU: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) అధ్యక్షుడు, FAPTO చైర్మన్ సాయి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు ఇకపై బోధనేతర (Non-Teaching) పనుల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. హాజరు యాప్, మధ్యాహ్న భోజనం యాప్ మినహా మిగిలిన అన్ని యాప్‌లను బహిష్కరించాలని తీర్మానించినట్లు తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విద్యాశక్తి” కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు, రాష్ట్ర విద్యాశాఖ…