దేశంలో జనం ఎవరికైనా రుణపడి ఉంటారా అంటే..అది రైతుకి, సైనికుడికి మాత్రమే. ఈ రోజుకీ భారత్ లో రైతు, తన కష్టానికి తగిన ప్రతిఫలం పొందట్లేదు. ఇండియా లో ఈ రోజు తీవ్రమైన కరవు లేదు. జనానికి 3 పూటలా తిండి దొరుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చెరో కోటి ఎకరాల వ్యవసాయం జరుగుతోంది. ప్రజలకు పీడీఎస్ ద్వారా ఆహార ధాన్యాలు అందుతున్నాయి. ఇంత జరుగుతున్నా రైతు బతుకు మాత్రం అంతంత మాత్రమే. రైతు సంక్షేమం గురించి అందరూ…
Alluri District: కాలం మారిన.. టెక్నాలజీ పెరిగిన కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అభ్యుదయ సమాజంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ స్థాయిని చేరురుతున్న ఈ కాలంలో కూడా కొన్ని గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది అంటే ఆ ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నాయో ఆలోచించాలి. పూర్వకాలంలో కనీస వైద్య సదుపాయాలు లేక…
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మాట పగటికలలా మిగిలిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం లో ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మాదిగ జాతి మరో ఉద్యమానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి పెద్దలు ఎనిమిది సంవత్సరాలు అయినా…